మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి)/ఎల్‌బీ నగర్: తెలంగాణ ఉద్యమాన్ని తన పదునెక్కిన పాటలతో ఉర్రూతలూగించిన గాయకుడు సాయిచంద్ ప్రజల గుండె ల్లో చిరకాలం నిలిచిపోయే తమ్ముడు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. శనివారం హస్తినపురంలో నిర్వహించిన సాయిచంద్ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొని సాయి చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లా డుతూ సాయిచంద్ మరణించి ఏడాది అవుతుందంటే నమ్మలేకపోతున్నానని, తన మాట, పాటలతో తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచిన గొప్ప కళాకారుడని కీర్తించారు.
ఆయన జ్ఞాపకార్థం పాటల సీడీలు, పుస్తకాలను విడుదల చేసి తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమానికి సాయి అందించిన సేవలు మాటల్లో చెప్పలేనిదని, వెలకట్టలేనిదన్నారు. సాయిచంద్ లాంటి గొప్ప నాయకుడిని, కళా కారుడుని బీఆర్‌ఎస్, తెలంగాణ సమాజం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి ఎన్నికల సభల్లో సాయిచంద్ లేని లోటు స్పష్టంగా కనిపించిందన్నారు.