calender_icon.png 22 December, 2024 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంటులో వక్ఫ్ బోర్డు బిల్లును అడ్డుకుంటాం: అసదుద్దీన్ ఓవైసీ

07-10-2024 11:17:38 AM

పాలస్తీనా పరిస్థితులను చూసి ముస్లింలలో ఐక్యత రావాలి....ఓవైసీ 

నిజామాబాద్, (విజయక్రాంతి): దేశంలో అనేక తరాలుగా ఉన్న వక్ఫ్ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం తీసుకు వస్తున్న వక్ఫ్ బోర్డు బిల్లును తన శాయశక్తుల అడ్డుకుంటానని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నిజామాబాద్ లో ఆదివారం రాత్రి ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమకాలీన రాజకీయ పరిస్థితులు అన్న అంశంపై నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.  పార్లమెంట్ ఎంఐఎం పార్టీకి అసదుద్దీన్ తో పాటు మరో 5 సీట్లు ఉంటే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టేది కాదని ఆయన అన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందితే గుజరాత్ లోని సోమనాథ్ లో గల హజ్ మంగల్షా దర్గా, మసీదు కూల్చివేతకు గురయ్యే అవకాశం ఉందని, ఇలా దేశవ్యాప్తంగా అనేక వక్ఫ్ ఆస్తులపై ప్రభావం పడినందుని అసదుద్దీన్ అన్నారు. వక్ఫ్ బై యూజర్ అనే పదం కేవలం ముస్లింలకు మాత్రమే కాదని దానిని వాడుకునే అందరికీ వర్తిస్తుందని ఆయన తెలిపారు.


ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ సూచనల మేరకు మోడీ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని ఓవైసీ అన్నారు. పాలస్తిన యుద్ధం ప్రారంభమై ఏడాది గడిచిందని, ఏడాది కాలంలో ముస్లింలు ఎంతో కోల్పోయారని ఇప్పటికన్నా వారు ఐక్యం కావాలని ఓవైసీ పిలుపునిచ్చారు. తెలంగాణ సెక్రటేరియట్ తో పాటు అనేక ప్రభుత్వ కట్టడాలు చెరువులో ఉన్నాయని, వాడిని కూల్చకుండా మూసిలో ఉన్న పేద ప్రజల గృహాలను ఎలా కోలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశానికి మలక్పేట ఎమ్మెల్యే, ఎంఐఎం పార్టీ జిల్లా ఇంచార్జ్ అహ్మద్ బలాల, ప్రస్తుత అధ్యక్షుడు షకీల్, నిజామాబాద్ చేపట మేయర్, బైంసా మున్సిపల్ చైర్మన్ జుబేర్, ఎంఐఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.