calender_icon.png 6 February, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరాటేలో గోల్డ్, సిల్వర్ మెడల్‌తో అదరగొట్టిన సాయి సంతోష్

06-02-2025 12:00:00 AM

హుజురాబాద్, ఫిబ్రవరి5 : ఇటీవలే ముంబైలో జరిగిన కరాటే పోటీలో కరీంనగర్ జిల్లాహుజురాబాద్ కు చెందిన సాయి సంతోష్ పసిడి, రజత పథకాలు సాధించి హుజురాబాద్ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటాడు. 

ముంబైలోని హుజురాబాద్ పట్టణానికి చెందిన జూపాక పల్లవి, హరిప్రసాద్ ల కుమారుడు సాయి సంతోష్ ముంబైలోని ప్రియదర్శిని ఇండోర్ స్టేడియంలో వరల్డ్ పులకాశి శోటోఖాన్ కరాటే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కరాటే పోటీలో ఈ ఘనతసాధించాడు.

14 సంవత్సరాల లోపు విభాగంలో పాల్గొన్న సాయి సంతోష్ కటాలో స్వర్ణం సాధించగా, స్పారింగ్ లో సిల్వర్ మెడల్ సాధిం చాడు. కరాటే లో పథకాలు సాధించి హుజురాబాద్ పట్టణానికి వన్నెతెచ్చినందుకు కరాటే మాస్టర్ బాబురావు,  హుజురాబాద్ పట్టణ సీఐ తిరుమల గౌడ్ తో పాటు పలువురు అందించారు.