25-02-2025 12:00:00 AM
సాయిపల్లవి తెలుగులో ‘తండేల్’తో మంచి హిట్ కొట్టింది. ఇక ఆ తరువాత ఆమె తెలుగు ప్రాజెక్ట్స్ ఏమీ ప్రకటించలేదు. కోలీవుడ్‌లో మాత్రం ఒకట్రెండు సినిమాలు చేస్తోంది. సాయిపల్లవి ఎప్పుడూ ఆత్రంగా సినిమాలు చేసింది లేదు. ఆచి తూచి అడుగులు వేస్తుంది. ప్రస్తుతం సాయిపల్లవి బాలీవుడ్‌లో బిజీబిజీగా ఉంది. హిందీ ‘రామాయ ణం’లో సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు ఆమె పూర్తి సమయం కేటాయిస్తోందట. అలాగే అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా రూపొందుతున్న చిత్రంలోనూ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోందట. ఈ సినిమా ప్రకటించి చాలా కాలం అవుతోంది. అయితే జునైద్ ఖాన్ బిజీగా ఉండటంతో షూటింగ్ ఆలస్యమవు తూ వస్తోంది.
జునైద్ ఖాన్ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావిస్తున్నారు. ఏ సినిమా అయి నా సాయిపల్లవి నటించిందంటే మినిమం హిట్ గ్యారంటీ అన్న టాక్ ఉండటంతో ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు సినిమాలతో సాయిపల్లవి బాలీవు డ్‌లోనూ బిజీ అయిపోవడం ఖాయమ ని అంతా భావిస్తున్నారు.