చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను తమిళ చిత్ర పరిశ్రమ వేడుకగా నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో కోలీవుడ్‌కు చెందిన ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘అమరన్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. ‘మహా రాజ’ చిత్రానికి ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి అవార్డులు అందుకున్నారు. ఈ విజయంపై సాయిపల్లవి ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో పోటీ మధ్య తనకు ఈ అవార్డు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు.
“22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నందుకు నాకెంతో సంతోషం, గర్వంగా ఉంది. గతేడాది ఎన్నో గొప్ప చిత్రాలొచ్చాయి. ఈ క్రమంలోనే ఎంతో పోటీ నెలకొంది. అలాంటి సమయంలో ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయ డం ఆనందంగా ఉంది. నా అభిమానులు చూపించే ప్రేమ నన్నెంతో భావోద్వేగానికి గురి చేస్తుంటుంది. అలాంటి నా అభిమానులకు ధన్యవాదాలు. ఈ సినిమా ముకుంద్ కుటుంబ సభ్యులు, ఆయన భార్య వల్లే సాధ్యమైంది.
వారే ఈ కథను ప్రపంచానికి చెప్పడానికి అంగీకరించారు. దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఒక జవాను కథ ఇది” అని సాయిపల్లవి తెలిపారు. అమరన్ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ ఎడిటర్, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగాల్లో అవార్డులు వ చ్చాయి. ఉత్తమ నటుడిగా ‘మహారాజ’ చిత్రానికి విజయ్ సేతుపతి అవార్డును అందుకున్నారు.
ఉత్తమ చిత్రం: అమరన్
రెండో ఉత్తమ చిత్రం: లబ్బర్ పందు
ఉత్తమ నటుడు: విజయ్ సేతుపతి (మహారాజ)
ఉత్తమ నటి: సాయిపల్లవి (అమరన్)
ఉత్తమ ఎడిటర్: ఫిలోమిన్ రాజ్ (అమరన్)
ఉత్తమ బాలనటుడు: పొన్వెల్ (వాళై)
ఉత్తమ సహాయనటుడు: దినేశ్ (లబ్బర్ పందు)
ఉత్తమ సహాయనటి: దుషారా విజయన్ (వేట్టయన్)
ఉత్తమ రచయిత: నిథిలన్ సామినాథన్ (మహారాజ)
ఉత్తమ సంగీత దర్శకుడు: జీవీ ప్రకాశ్ (అమరన్)
స్పెషల్ జ్యూరీ అవార్డు: మారి సెల్వరాజ్ (వాళై), పా. రంజిత్ (తంగలాన్)