calender_icon.png 5 October, 2024 | 6:56 AM

సాయి విగ్రహాలు తొలగించాలి

05-10-2024 01:45:33 AM

కాశీలో తీసుకున్న చొరవ అభినందనీయం

జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి

అజయ్‌శర్మ అరెస్టును ఖండించిన స్వామీజీ

గోధ్వజ్ యాత్రలో భాగంగా జంషెడ్‌పూర్‌కు చేరుకున్న శంకరాచార్య 

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: సనాతన ఆలయాల్లో చాంద్ మియా సాయి విగ్రహాలను తొలగించడం అవసరమని జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఉద్ఘాటించారు. కాశీలోని ఆలయాల్లో ఈ చొరవ తీసుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

సనాతన్ రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌శర్మ అరెస్టును స్వామీజీ ఖండించారు. భయం లేదా కొన్ని అనవసర కారణాలతో ఆలయాల్లో ఇలాంటి విగ్రహాలు పెడుతున్నారని స్వామీ జీ ఆరోపించారు. ఈ విగ్రహాలను పూజించాలని సనాతన ధర్మంలో ఎక్కడా లేదని చెప్పారు.

కొంతమంది అవగాహన లేక ఈ చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇది సనాతన ధర్మానికి పూర్తి విరుద్ధమని తెలిపారు. తిరుమల ప్రసాదంలో నాణ్యతపై ఇం తగా చర్చ జరుగుతున్న ఈ రోజుల్లో ఆలయాల్లోనూ అపవిత్ర కార్యకలాపాలపై దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యా న్ని నెరవేర్చిన అజయ్ శర్మను అరెస్టు చేయ డం అనైతికమని శంకరాచార్య స్వామీ జీ అ న్నారు.

ఎవరైనా భక్తులు సాయిని కొలవాలనుకుంటే ప్రత్యేక మందిరాలు ఉన్నా యని చెప్పారు. సాయిబాబా ఒక ముస్లిం ఫకీర్ అని, దేవాలయాల్లో ఆయన విగ్రహం పెట్ట డం సరికాదని సూచించారు. కానీ, శివలింగంపై సాయి ఉన్నట్లు లేదా సాయి చేతిలో సుదర్శన చక్రం ఉన్నట్లు విగ్రహాలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుం డా సాయి చాలీసా, సాయి గాయత్రి మం త్రం ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని చెప్పారు. 

నేడు రాంచీలో గోధ్వజ్ స్థాపన

గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రలో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని హావ్‌డా శంకర్‌మఠ్‌లో గోప్రతిష్ఠ జెండాను స్థాపించిన అవిముక్తేశ్వరానంద్ స్వామీజీ శుక్రవారం జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చేరుకున్నారు. శనివారం జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాణిసతి ఆలయంలో గోధ్వజాన్ని స్థాపిస్తారు.

కాగా, ఛత్తీస్‌గఢ్‌లో ఆవును రాజ్యమాతగా గుర్తించాలని స్వామీజీ తరఫున గోసంరక్షణ కమిటీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌కు శుక్రవారం వినతిపత్రం అందించారు. గుజరాత్‌లోని సూరత్‌లో కూడా రాజ్యమాతగా గోవును గుర్తించాలని గోసేవకులు తీర్మానాన్ని జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.