30-03-2025 04:22:22 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రములో సాయి గాయత్రి విద్యాలయలో పాఠశాల నాలుగో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులచే పాటలకు నృత్యాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులను యాజమాన్యాన్ని ఉపాధ్యాయులను ముఖ్య అతిథి మండల విద్యాధికారి పిడతల వెంకటేశ్వర్లు అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని మండలంలోని విద్యార్థిని విద్యార్థులకు మంచి భవిష్యత్తును కల్పించాలని విలువలతో కూడిన విజయం అందించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అర్వపల్లి శంకర్ మాట్లాడుతూ... పాఠశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు విద్యార్థిని విద్యార్థులకు విద్యతో పాటు ఎన్నో విషయాలు నేర్పుతూ ప్రతి సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ విద్యార్థిని విద్యార్థులను చారిత్రక ప్రదేశాలకు తీసుకువెళ్లి వారికి అవగాహన కల్పిస్తూ ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహిస్తూ అనేక విషయాలు నేర్పుతున్నామని భవిష్యత్తులో మరింత అంకితభావంతో శ్రద్ధతో మండలంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్ది క్రమశిక్షణ కలిగిన సైనికుల తయారు చేస్తామని విద్యతో పాటు విలువలను కూడా నేర్పుతామని మట్టిలో మాణిక్యాలను వెలికి చేస్తామని తల్లిదండ్రులు తమ ఉపయోగించిన నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తామని విద్యాబోధనలో సరికొత్త పద్ధతులను అవలంబించి అందరికీ కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ బడ్జెట్ స్థాయిలో అందరికి అందుబాటులో ఫీజుల పాఠశాల నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను ఆయన అభినందించారు. వార్షికోత్సవాలను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులకు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు మిత్రులకు పుర ప్రముఖులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్ పర్సన్ శ్రీమతి ఉషారాణి, ఏవో ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.