28-04-2025 10:54:29 PM
ఏకలవ్య సీటు సాధించిన సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థి..
విద్యార్థిని అభినందించిన సీఐ ఇంద్ర సేనారెడ్డి..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పిల్లల బంగారు భవిష్యత్తే తల్లిదండ్రుల లక్ష్యం. ఇందుకోసం నిరంతరం శ్రమిస్తుంటారు. రోజురోజుకూ ఆంగ్ల మాధ్యమానికి ఆదరణ పెరుగుతుండటంతో ఆ దిశగా చదివించాలని ఆశపడుతుంటారు. ఇందుకు చక్కటి వేదికగా నిలుస్తోంది జూలూరుపాడులోని సాయి ఎక్సలెంట్ స్కూల్ ఇక్కడ నిరుపేదల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందుతోంది. అన్ని సదుపాయాలు కలిస్తూ ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నారు. విద్యతో పాటు అన్నీ సదుపాయాలు ఉన్నాయి. జూలూరుపాడు మండలం కేంద్రంలోని పాపకొల్లు రోడ్డు నందు కలిగిన సాయి ఎక్సలెంట్ స్కూల్ లో బోడ. ప్రజ్ఞ తేజ అనే విద్యార్థి ఏకలవ్య సీటు సాధించాడు.
ఈ సందర్భంగా సిఐ ఇంద్ర సేనా రెడ్డి బి. ప్రజ్ఞ తేజని, తల్లిదండ్రులైన బి.కృష్ణని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాయి ఎక్సలెంట్ స్కూల్ లో నవోదయ, గురుకులం,, ఏకలవ్యలో సీట్లు అత్యధిక స్థాయిలో సీట్లు సాధించినందుకు స్కూల్ మేనేజ్మెంట్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హుస్సేన్ మాట్లాడుతూ... సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తూ, జిల్లా స్థాయిలో పేరు గడించినందుకు విద్యార్థి, విద్యారినిలకు, తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్, నాగరాజు అభినందనలు తెలియజేశారు.