calender_icon.png 29 December, 2024 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సాయిధరమ్ తేజ్

14-07-2024 02:34:15 PM

హైదరాబాద్: సినీనటుడు సాయి ధరమ్ తేజ్ ఆదివారం జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పిల్లలపై జరుగుతున్న అకృత్యాలు, సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయడాన్ని నిరోధించే వ్యూహాలపై చర్చించారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లలపై అసభ్యకరంగా జోక్స్ వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంలను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. సాయిధరమ్ తేజ్ పోస్టుపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క వీడియో పోస్టు చేసిన యూట్యూబర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు ప్రణీత్ హనుమంతును బెంగళూరులో అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రణీత్‌పై ఐటీ చట్టం (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్), పోక్సో చట్టం (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం), ఐటీ చట్టంలోని సెక్షన్ 79, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సెక్షన్ 294 సెక్షన్ 67బీ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రణీత్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.  ఈ సమస్యపై ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యలకు ఆదివారం సాయిధరమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.