calender_icon.png 25 October, 2024 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలిటికల్ ఎంట్రీపై సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

25-10-2024 04:33:31 PM

హైదరాబాద్: రాజకీయాలు అంత ఈజీ కాదంటున్నాడు మెగా మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్. రాజకీయాలపై సుప్రీం హీరో తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావాలంటే ఎన్నో అంశాలపై అవగాహన ఉండాలని తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి అంత సినిమా రంగంపైనే ఉందని చెప్పారు. పాలిటిక్స్ లోకి రావాలనే ఆలోచన ఇప్పుడు లేదని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయి ధరమ్ తేజ్ తనకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి గుర్తు చేసుకుంటూ ఇది తనకు పునర్జన్మ అంటూ వ్యాఖ్యానించారు. బైకు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించాడు. తను ప్రాణాలతో ఉండడానికి హెల్మెట్ కారణమని చెప్పుకొచ్చాడు. కాగా, కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తీస్తున్న సినిమాలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది.