calender_icon.png 11 March, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్య

11-03-2025 12:39:18 AM

శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు చేపడతాం 

గంజాయి మట్కా ఇసుక రావణా కట్టడికి ప్రత్యేక బృందం ఏర్పాటు 

నిజామాబాద్ మార్చి 10 (విజయక్రాంతి) : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షిస్తామని ఈ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తామని అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతామని నిజామాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్య తెలిపారు. నిజాంబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం అయినా నిజామాబాద్ సిపీ గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా గంజాయి మట్కా కట్టడికై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

మహారాష్ర్ట కర్ణాటక రాష్ర్ట సరిహద్దులు కావడంతో మరింత అప్రమత్తంగా ఉండి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తామని ఆయన తెలిపారు. సైబర్ నేరాలపై గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ప్రజలు మోసపోతున్నారని ఈ మోసాలని అరికట్టడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రజలు 100 కు వెంటనే సమాచారం అందించాలని మహిళా భద్రతలకు పటిష్టమైన చర్యలు చేపడతామని సిపి సాయి చైతన్య తెలిపారు.