ముషీరాబాద్ (విజయక్రాంతి): సాయిబాబా తన చివరి శ్వాస వరకు కూడా ప్రజల కోసమే తపించాడని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రొఫెసర్ సాయిబాబాపై యువ కవులు రాసిన కవితా సంకలనం ‘స్వప్నాల ప్రేమికుడు’ అనే పుస్తకాన్ని వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్, కవి విమర్శకులు ఎకే ప్రభాకర్, రచయిత్రి కరుణ తాయారమ్మ, సాయిబాబా తమ్ముడు రాందేవ్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల కోసం, గిరిజన, ఆదివాసీ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి, రాజ్యపు కుట్రలకు బలై, అక్రమ కేసుల్లో పదేళ్లు జైలు శిక్ష అనుభవించి నరపరాదిగా విడుదలైన సాయిబాబా తన చివరి శ్వాస వరకు కూడా ప్రజల కోసమే తపించాడన్నారు. అటువంటి వ్యక్తి ఆలోచనలను, ఆశయాలను, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాల్సినవసరం ఉందన్నారు. యువ కవులు రాసిన ఆ పుస్తకం ఉద్యమాలను, ప్రజా ఉద్యమాల పట్ల బాధ్యత యుతంగా తెలియజేసే విధంగా ఉందని అన్నారు. దొంతం చరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యువ కవులు మహేష్ వేల్పుల, పేర్ల రాము, లావణ్య, ఉదయ్, హతీరాం, డేవిడ్, శ్రీనిధి, అనుష తదితరులు పాల్గొన్నారు.