13-03-2025 01:16:16 AM
రాజేంద్రనగర్ (కార్వాన్) మార్చి 12: గోల్కొండ జగదాంబిక ఆలయం సలహా దారు బొమ్మల సాయిబాబా చారి కి బెస్ట్ సోషల్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఆయన బుధవారం గోల్కొండ సబ్ డివిజన్ ఏసీపి సయ్యద్ ఫయాజ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఏటా ఊర్వ హైస్కూల్ యాజమాన్యం వారు అవార్డులను ప్రదానం చేస్తుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది గోల్కొండకు చెందిన బొమ్మల సాయిబాబా చారి కి అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారి ఆశీస్సు లతో తాను చాలా సంవత్సరాలుగా ప్రజ లకు సేవ చేస్తున్నట్లు తెలియజేశారు. అవా ర్డు రావడం మరింత బాధ్యత పెంచింద న్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రొఫెష నల్ వర్కర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంతచారి, మహంకాళి అమ్మవారి పూజారి సురేష్ చారి, శివా చారి తదితరులు పాల్గొన్నారు.