calender_icon.png 21 October, 2024 | 8:48 PM

మట్కాలో సాహూగా..

20-10-2024 12:00:00 AM

వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబోలో రూపొందిన చిత్రం ‘మట్కా’. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్ మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నా రు. ఈ సినిమాలో నటుడు నవీన్ చంద్ర ఒక కీలక పాత్ర పోషి స్తున్నారు. ఆయన పాత్రను ‘సాహు’గా పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నవీన్ చంద్ర స్కూటర్‌పై కూర్చుని ఇంటెన్స్‌గా చూస్తున్న పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.