ఐదురోజుల పాటు ప్రశ్నించనున్న అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): సాహితీ ఇన్‌ఫ్రా పేరిట వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కేసులో ఆ సంస్థ ఎండీ లక్ష్మీనారాయణను కోర్టు అనుమతితో ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్ట డీలోకి తీసుకుంది. సోమవారం నుంచి ఈ నెల 18 వరకు ఈడీ ఆయనను విచారించనుంది.
అందులో భాగంగా ఆదివారం రా త్రి ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసు కున్నారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. ఫ్రీలాంచ్ ఆఫర్ల పేరిట దాదాపు 1600 మంది కస్టమర్ల నుంచి రూ.2 వేల కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, సెప్టెంబర్ 29న పీఎంఎల్‌ఏ యాక్ట్ కింద లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ స్కాంలో ఎవరి నుంచి ఎంత వసూలు చేశారనే వివరాలను ఈడీ అధికారులు రాబట్టనున్నారు.
గతంలోనూ కేసులు
ఫ్రీలాంచ్ పేరుతో వేల కోట్లు వసూలు చేసిన సాహితీ ఇన్‌ఫ్రా సంస్థ.. వినియోగదారులకు ప్లాట్లు అప్పగించకుండా మోసగించినట్లు ఆరోపణలున్నా యి. కస్టమర్ల ఫిర్యాదుతో 2022 ఆగస్టులోనే ఈ విషయంలో పలు సెక్షన్ల కింద ఎండీ లక్ష్మీనారాయణపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరా బాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు గతంలోనే లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.