calender_icon.png 22 December, 2024 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈడీ కస్టడీకి సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ

08-10-2024 12:53:04 AM

ఐదు రోజుల పాటు విచారణకు అనుమతించిన నాంపల్లి కోర్టు 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో వేలాది మందిని మోసగించిన సాహితీ ఇన్ ఫ్రా ఎండీ  భూదాటి లక్ష్మీనారాయణను ఈడీ కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14 నుంచి 18 వరకు ఈడీ కార్యాలయంలో అధికారులు ఆయనను వి చారించనున్నారు.

ఈ కేసులో గత నెల 29న లక్ష్మీనారాయణను ఈడీ అరెస్ట్ చేసింది. అ నంతరం విచారణలో భాగంగా ఈడీ అధికారులు నిందితుడిని 10 రోజుల కస్టడీకి అను మతించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ప్రీ లాంచ్ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా మొత్తం 9 ప్రాజెక్టుల పేరుతో సుమారు 700 మందిని మోసం చేసి రూ. 360 కో ట్లకు పైగా వసూలు చేసినట్లు ఈడీ ఆరోపించింది.

అందులో సాహితీ సితార పేరుతో రూ. 135 కోట్లు, సిస్టా అడోబ్ పేరుతో రూ. 79 కోట్లు, సాహితీ గ్రీన్ రూ. 40 కోట్లు, సాహితీ మెహతో రూ. 44 కోట్లు, ఆనంద ఫర్చూన్ రూ. 45 కోట్లు, సాహితీ కృతి రూ. 16 కోట్లు, సాహితీ సుదీక్ష రూ. 22 కోట్లు, రుబికాన్ సాహితీ పేరుతో రూ. 7 కోట్లు, సా హితీ స్వాద్ పేరుతో రూ.65 కోట్లు వసూలు చేసి లక్ష్మీనారాయణ తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లుగా అధికారులు గుర్తిం చారు. అదేవిధంగా ఈ కేసులో సాహితీ ఇన్‌ఫ్రా సంస్థకు చెందిన రూ. 161  కోట్ల ఆస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది.