మందమర్రి (విజయక్రాంతి): బహుజన సాహిత్య అకాడమీ 8వ తెలంగాణ స్టేట్ కాన్ఫరెన్స్ లో పట్టణానికి చెందిన దాసరి శ్రావణ్ కుమార్ జాతీయ అవార్డు అందుకున్నారు. హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లాల రాధాకృష్ణ, చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. ఈ సందర్భంగా నల్లాల రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ ప్రజా ఉద్యమ కారులకు, సంఘ సేవకులు, కవులు, రచయితలకు, స్వచ్ఛంద సంస్థలకు, అవార్డులను అందజేసినట్లు తెలిపారు. అంతేకాకుండా అవార్డు గ్రహీత దాసరి శ్రావణ్ కుమార్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో హోం గార్డ్ గా విధులు నిర్వహిస్తూ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తమ వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డుకు ఎంపిక చేసి అవార్డు ప్రదానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు నల్లాల రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ ఎం గౌతం, రాష్ట్ర కమిటీ సభ్యులు బదే వెంకటేష్ లు పాల్గొన్నారు.