22-04-2025 08:52:20 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాలలో ఇల్లెందు సాహితీ ప్రభంజనం కొనసాగింది. తెలంగాణ ఇంటర్ బోర్డు ఈరోజు ప్రకటించిన ఫలితాలలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో యామనగండ్ల సమన్విత 993/1000 మార్కులతో రాష్ట్రస్థాయి 3వ ర్యాంకు, శివాని గుప్తా 992/1000 మార్కులతో 4వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం బైపిసి విభాగంలో షేక్ సోహేలా 988/1000 మార్కులు, అయన పులప్పాడి 985/1000 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించారు.
ద్వితీయ సంవత్సరంలో సీఈసీ విభాగంలో ఎస్డి ఆసియా 952/1000 మార్కులను సాధించింది. ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో సాదియా తన్వీర్ 465/470 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయి 4వ స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో బత్తిని కావ్య శ్రీ 461/470, పాసి గంగోత్రి 460/470 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో మహమ్మద్ షాహేస్తా 429/440 మార్కులు సాధించి ఇల్లందు పట్టణ ప్రథమ స్థానంలో నిలిచింది. మాహిన్ జబీన్ 427/440, షేక్ సమ 425/440 అత్యుత్త మ మార్కులు సాధించారు. అదేవిధంగా సిఇసి విభాగంలో హర్షితా శర్మ 492/500 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3వ స్థానం, జిల్లా ప్రథమ స్థానం, గుగులోతు విఘ్నేష్ 491/500 మార్కులతో రాష్ట్రస్థాయి 4వ స్థానం, జిల్లా ద్వితీయ స్థానంతో విజయఢంకా మ్రోగించారు.
కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల డైరెక్టర్ ఎంసి నాగిరెడ్డి మాట్లాడుతూ... క్రమశిక్షణతో నేర్చుకునే ప్రతిదీ భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తుందని సూచించారు. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి ర్యాంకులను సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గుజ్జర్లపూడి రాంబాబు, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.