calender_icon.png 20 April, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యంతో సహపంక్తి భోజన కార్యక్రమం

20-04-2025 09:00:07 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని కృష్ణ నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిట్టగనుపుల రమేష్ ఏర్పాటుచేసిన సహపంక్తి భోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పార్టీ ఉపాధ్యక్షుడు కాలే సామేలు ముఖ్యఅతిథిగా పాల్గొని భోజనం చేశారు. అనంతరం సామెల్ మాట్లాడుతూ... ఇన్ని రోజులుగా దొడ్డు బియ్యం వస్తుండగా అవి తినలేక పేద ప్రజలు అమ్ముకున్నారని ఇప్పుడు సన్న బియ్యం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసి తనకు వచ్చిన 24 కిలోల సన్న బియ్యంతో ఊరందిరినీ పిలిచి సహపంక్తి భోజనం పెట్టారు.

దీంతో ఆ ఊరి ప్రజలు కూడా సన్న బియ్యంతో వండిన భోజనాన్ని కడుపారా తిన్నారు. దింతో రమేష్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. సన్నబియ్యంతో పేదల కడుపు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి, తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సన్న బియ్యం పంపిణీ దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బేతం రామిరెడ్డి, మాజీ సర్పంచ్ లింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉప్పుల యుగేందర్ రెడ్డి, ఏనుగుల నాగేశ్వరరావు, సారెడ్డి అంజిరెడ్డి, లింగయ్య, రామచంద్రు, దస్తగిరి, పాషా, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.