calender_icon.png 18 April, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యంతో సహపంక్తి భోజన కార్యక్రమం

09-04-2025 10:29:53 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు సన్నబియ్యం కార్యక్రమంలో భాగంగా గ్రామశాఖ అధ్యక్షుడు కొమ్ము ఈ ధరావు ఏర్పాటుచేసిన సన్నబియ్యంతో సహపంక్తి భోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తిమినేని వీరయ్య పాల్గొని భోజనం చేశారు.

అనంతరం ముత్తిమినేని వీరయ్య మాట్లాడుతూ... భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాత్రమే పంపిణీ చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నల్లపాటి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బచ్చు అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతంగి బసవయ్య, ఉప్పుల జానకి రెడ్డి, చింతకాయల నాగరాజు, ఎండి రషీద్, శెట్టి గిరి, పనస శంకర్, అక్కినపల్లి రవి, గుండు నాగేశ్వరరావు, గట్టు వెంకన్న, పంది జానీ, లంజపల్లి శ్రీను, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.