కూకట్ పల్లి (విజయక్రాంతి): నిబద్ధత క్రమశిక్షణకు మారుపేరైన సగర కులస్తుల అభ్యున్నతి కోసం పాటుపడతానని శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. సోమవారం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర్ నగర్ లో గల సగర సంగం కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు భవనం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగాజరై కార్పొరేటర్ రోజా దేవి రంగారావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. అన్ని కులాలు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలలో ఉన్న సగర కులస్తులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ వారి మంచి చెడులను పరిష్కరిస్తూ తనకు తోచిన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. ఇతర కులాలకు ఆదర్శంగా సగర కులస్తులు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉండడం ఆదర్శనీయమన్నారు. నిరంతరం తాను నియోజకవర్గ అభివృద్ధి పైనే దృష్టి పెడతానని అందులో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కల్పిస్తానని తెలిపారు.
గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని తాను ఎమ్మెల్యే అయిన తర్వాత శేరిలింగంపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి శేర్లింగంపల్లి ముఖచిత్రాన్ని మార్చి వేయడం జరిగింది అన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ తనకు మద్దతు తెలిపి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రజలకు రుణపడి ఉంటూ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సగర మహిళా సంఘం సభ్యులు మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రానికి కుట్టు మిషన్లు ఇవ్వలని అభ్యర్థించగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా సగర మహిళ భవనం నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ గారు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట సగర సంగం ప్రధాన కార్యదర్శి ఆస్కానీ శ్రీనివాస్ సాగర్, సగర ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆస్కానీ మారుతి సాగర్, జగద్గిరిగుట్ట సగర సంగం అధ్యక్షులు ఆస్కానీ కొండయ్య సాగర్, కోశాధికారి కొమ్ముల రాజేష్ సాగర్, సాగర సంగం రాష్ట్ర నాయకులు కే పి రామ్ సాగర్, రమేష్ సాగర్, కె.పి రాములు సాగర్, ఎం రాములు సాగర్, జి సత్యనారాయణ సాగర్, గౌరవ సలహాదారులు, సగర మహిళా సంఘం అధ్యక్షురాలు జి కుసుమసాగర్, కోశాధికారి సిహెచ్ జ్యోతి సాగర్, వార్డు కమిటీ సభ్యులు చంద్రమోహన్ సాగర్, యువజన సంఘం అధ్యక్షులు ఎం మురళి సాగర్, ప్రధాన కార్యదర్శి సిహెచ్ శేఖర్ సాగర్, కోశాధికారి సంపత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.