calender_icon.png 3 December, 2024 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడమ కాలువ గండ్లను పూడ్చి రైతులకు సాగునీరు అందించాలి

18-09-2024 07:36:09 PM

కోదాడ నియోజకవర్గ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ

18 రోజులైనా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం

ఇసుక మేట వేసిన ప్రతి ఒక్క ఎకరానికి 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి

పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికి 25 వేలు

బావి పూడికకు 50 వేలు

మోటారుకు 50 వేలు చొప్పున ఇవ్వాలి

కోదాడ ఆర్టీవో నదిపత్రం అందించిన బిజెపి నేతలు

కోదాడ,(విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన వచ్చిన వరదలకు పంట కాలువలు, చెరువుకట్టలు, రహదారులు, పడిన గండ్ల నేటికీ 18 రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం గర్హనీయమని సూర్యాపేట జిల్లా కోదాడ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా బుధవారం ఆర్డీవో కార్యాలయం వద్ద బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ధర్నాను నిర్వహించి ఆర్డీవో సూర్యనారాయణకు మెమోరాండంను అందించడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ...సాగర్ కాల్వకు పడిన గండ్లను వెంటనే పూడ్చివేసి రైతులకు సాగునీరును అందించాలనీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం అంచనాలను సమగ్రంగా సర్వే చేయడం లేదనీ,వరదల వలన బూడిన బావులు,బోర్లు కొట్టుకుపోయిన మోటార్లను కూడా నష్టంకిందపరిగనించాలనీ తెలిపారు.రైతు భరోసాను వెంటనే రైతులకు అందించాలనీ అన్నారు. రైతు రుణమాఫీ నిబంధనలుసడలించి అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అమలు చేయాలనీ అన్నారు. ఇసుక మేట వేసిన  ప్రతి ఒక్క ఎకరాకు  రూ.50,000, పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు 25000,  వ్యవసాయ బావి పూడికకు 50 వేలు, బోరుకు పాతికవేలు, మోటారుకు 50 వేలు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాంఢ్ చేస్తున్నది అని అన్నారు. 


కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెలువోలు చిట్టయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్, కో కన్వీనర్ బొలిశెట్టి కృష్ణయ్య, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నల్లగొండ పార్లమెంట్ కన్వినర్, సోషల్ మీడియా పార్లమెంట్ కన్వినర్ శ్రీ వంగవీటి శ్రీనివాసరావు, అనంతగిరి మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు యడ్లపల్లి రామారావు జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్కూరు శ్రీనివాసరావు మండల అధ్యక్షులు భద్రంరాజు కృష్ణప్రసాద్, ఏలేటి వేంకటేశ్వర రెడ్డి, మల్లెబోయిన వెంకటేష్ యాదవ్, జెల్లా  జనార్ధన్, జెల్లా నరసింహారావు, సైదులు, సాయి కృష్ణ, పండు సాహెబ్, దాసు, శేట్టి కిరణ్ కుమార్, భూమా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.