- పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
గాంధీభవన్‌లో జాతీయ జెండావిష్కరణ
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): దేశంలో కాషాయ అజెండాను అమలు చేయాలని బీజేపీ చూస్తోందని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పార్లమెంట్‌లో అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అందులోభాగమేనని ఆరోపించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో మహేశ్‌కుమా ర్‌గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించగా పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్, ఎంపీ అనిల్ యాదవ్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెట్టొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.