calender_icon.png 11 January, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మై ఆటో ఈజ్ సేఫ్’తో భద్రత

01-12-2024 12:59:26 AM

  1. జగిత్యాల ఎస్పీ అశోక్’కుమార్
  2. జిల్లా కేంద్రంలో 1,500ఆటోలకు క్యూఆర్‌కోడ్ 

జగిత్యాల, నవంబర్ 30 (విజయక్రాంతి): ప్రయాణికుల రక్షణ, భద్రత కోస మే జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటోలను ‘మై ఆటో ఈజ్ సేఫ్’ అనే యాప్‌తో అనుసంధానం చేసినట్టు జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం ఆటో యజమానుల వివరాలు, పత్రాలు సేకరించి డిజిటలైజ్ చేసి తయారు చేసిన క్యూఆర్ కోడ్ పోస్టర్లను  ఆవిష్కరించారు.

అనంతరం పట్టణంలోని దాదాపు 1500 ఆటోలకు ఆ పోస్టర్లను అతికించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడు తూ.. రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆటోకు ఈ స్టిక్కర్లను అతికిస్తామన్నారు. ఆటోలో ప్రయాణించే వారు మై ఆటో ఈజ్ సేఫ్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆటోల్లో ప్రయాణించే సమయంలో డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించినా, ఇతర సమస్యలు ఏర్పడినా పోస్టర్‌లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

ఆ ఫిర్యాదు ఆధారంగా ఆటో లైవ్ లొకేషన్ పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ కనిపెట్టి స్థానిక పోలీసులకు సమాచారిస్తుందన్నారు. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడుతారని ఎస్పీ అశోక్‌కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, ఆర్టీవో శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు వేణుగోపాల్, కృష్ణారెడ్డి, క్యూఆర్ కోడ్ యాప్ రూపకర్త రమేష్‌రెడ్డి, ఆర్‌ఐ వేణు, ట్రాఫిక్ ఎస్సై మల్లే శం పాల్గొన్నారు.