calender_icon.png 18 January, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రతా ప్రమాణాలు పాటించాలి

18-01-2025 12:00:00 AM

బ్యాంకర్లతో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సమావేశం

మెదక్, జనవరి 17(విజయక్రాంతి): బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి బ్యాంకర్లకు సూచించారు. శుక్రవారం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్నీ బ్యాంక్ మేనేజర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బ్యాంక్ ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి వ్యూహాత్మకంగా బ్యాంక్ ఎదుట, బ్యాంక్ లోపల మంచి సిసి కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడానికి, చొరబాట్లను గుర్తించడానికి ఆధునిక అలారం వ్యవస్థను  ఏర్పాటు చేసుకోవాలని వారికి సూచించారు. ఏటీఎంలకు మనీ తీసుకొని వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ సిబ్బందికి కేటాయించిన ఆయుధాన్ని కలిగి ఉండి ఎల్లప్పుడూ అప్రమత్తంగా  ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు.

ఏటీఎంలో అలారం, సిసి కెమెరాల పనితీరును ఎల్లప్పుడు పర్యవేక్షించాలన్నారు. చుట్టు ప్రక్కల ఎవరైనా అపరిచితులు అనుమానస్పదంగా తిరుగుతున్నట్లు అనిపిస్తే సెక్యూరిటీ సిబ్బంది వెంటనే సంబందిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ టౌన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.