నిర్మల్ (విజయక్రాంతి): భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో భద్రత కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విలాస్ అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం నిర్వహించారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న మేస్త్రీలకు పెయింటర్లకు ఎలక్ట్రిషన్లకు పంబలర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చనిపోతే ఐదు లక్షల బీమా కల్పించాలని కూలి రేట్లు పెంచాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనివాస్ చారి, భవన నిర్మాణ రంగ కార్మికులు పాల్గొన్నారు.