సంగారెడ్డి కల్లెక్టర్ క్రాంతి వల్లూరు...
సంగారెడ్డి (విజయక్రాంతి): పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ముందు, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి సర్వే రిపోర్టును సమర్పించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు(Collector Kranti Valluru) అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో టీజీ ఐపాస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు పరిశ్రమలలో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని, కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు తరుచు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి నెలా సమావేశానికి ముందు, చెక్‌లిస్ట్‌ను సమర్పించాలని సూచించారు. పరిశ్రమల అనుమతుల కోసం దరఖాస్తులు ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేయాలని స్పష్టం చేశారు. పరిశ్రమల శాఖ, అధికారులు 9 పరిశ్రమలకు సంబంధించిన కూల్ ఎధనాల్ ముడి పదార్థాల కేటాయింపుపై పరిశ్రమల శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జా నాయక్, ఆర్డిఓ రవీందర్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి అఖిలేష్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.