calender_icon.png 9 January, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

08-01-2025 12:46:02 AM

* రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా బైక్ ర్యాలీ ప్రారంభించిన రాష్ర్ట వైద్య  ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా

జడ్చర్ల, జనవరి 7: వ్యక్తిగత భద్రత అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ర్ట వైద్య ఆరో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సంద ర్భంగా రవాణా శాఖ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాదంలో జరుగుతున్న విషయాలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని, హెల్మెట్ ధరించి రక్షణ కవచం వ్యక్తిగతంగా ఉంచుకోవాల్సిన అవసరం వాహనచోదకులకు ఉందని పేర్కొ న్నారు.  జడ్చర్ల నిర్వహిస్తున్నా వైజ్ఞానిక ప్రద ర్శన సందర్భంగా విద్యార్థులకు, సందర్శ కులకు అవగాహన కల్పించనున్నారు.

నెల రోజుల పాటు విస్తృత స్థాయిలో కార్యక్ర మాలను నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసు కువస్తామని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ ఏ.వి.యన్ రెడ్డి, శాసన సభ్యులు ెున్నం శ్రీనివాసరెడ్డి, అనిరుధ్  రెడ్డి, జి మధు సూధన్ రెడ్డి, వాకిటి శ్రీ హరి, విద్యా శాఖ డైరెక్టర్ ఈ.వి నరసింహ రెడ్డి,రాష్ర్ట మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేధుల్లా కొత్వాల్,జిల్లా కలెక్టర్ వి జయేందిర బోయి, ఎస్పీ డి.జానకి,డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్, ఎం.వి. ఐ రఘు తదితరులు పాల్గొన్నారు.