28-08-2024 12:30:52 AM
హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (విజయక్రాంతి): మహిళల భద్రతకు హైదరా బాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్‌సీఎస్సీ) చర్యలు చేపట్టిందని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆప్ కామర్స్) కార్యాలయంలో సీపీ అధ్యక్షతన మొదటి అవగా హన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భం గా సీపీ మాట్లాడుతూ.. మహిళలు పనిచేస్తున్న కార్యాలయాలు, సంస్థలలో లైంగిక వేధింపుల నిర్మూలనకు వర్క్‌షాప్‌ను ప్రారంభించామన్నారు.
అన్ని సంస్థల్లో అంతర్గత కమిటీలు తప్పనిసరిగా ఏర్పాటు చేసి మహి ళ వేధింపుల నిరోధక చట్టం(పీఓఎస్‌ఎచ్) చట్టంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. క్రమం తప్పకుండా ఈ అవగాహన సదస్సులు, సమగ్ర శిక్షణను అందించడం ద్వారా మహిళలకు రక్షణగా ఉంటుందన్నా రు. కార్యక్రమంలో మహిళా భద్రత డీజీ శిఖాగోయల్, మహిళా శిశు అభివృద్ధిశాఖ కమిషనర్ వాకాటి కరుణ, సెక్రటరీ జనరల్ శేఖర్ రెడ్డి, మహిళా భద్రత విభాగం డీసీపీ ధార కవిత, జాయింట్ సెక్రటరీ గీతా గోటి పాల్గొన్నారు. కార్పొరేట్ సంస్థల నుంచి సుమారు 100 మంది మహిళలు పాల్గొన్నారు.