15-04-2025 12:32:03 AM
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొం దించి, మే డే రోజున బిల్లును చట్టరూపంలో అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం సచివాలయంలో గిగ్ వర్కర్లు, యూ నియన్ల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా స మావేశమయ్యారు. గిగ్‌వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా సదుపాయం, ఇతర హక్కులను కల్పించేలా కార్మికశాఖ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ బిల్లు ముసాయిదాను తయారుచేసింది. అందులో పొందు పరిచిన అంశాలను అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు.
త యారుచేసిన ముసాయిదాకు పలుమార్పులు చేర్పులను ముఖ్యమంత్రి సూచించా రు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వడం తో పాటు కంపెనీలు, అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం, సుహృద్భావం ఉండేలా కొత్త చట్టం ఉండాలన్నారు. ఈ బిల్లు ముసాయిదాను వెంటనే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి, ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ర్ట వ్యాప్త ంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ప్యాకేజ్ డెలివరీల్లో దాదాపు 4 లక్షల మంది గిగ్‌వర్కర్లు పనిచేస్తున్నారని, అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు. వీటితోపాటు అధి కారులు ఈ ముసాయిదాలో పొందుపరిచిన అంశాలపై తుది కసరత్తు చేయాలని, అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈనెల 25వ తేదీ నాటికి బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలని ఆదేశించారు.
నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తిచేసి అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మే డే రోజున చట్టం అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చే యాలని చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా గిగ్ వర్కర్లకు ప్రమాదబీమాను అమలు చేశామని చెప్పారు. అమలు చేసే చట్టం కూ డా దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా ఉం డాలని సూచించారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎస్ శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్ళులు రామకృష్ణారావు, జయేశ్‌రంజన్, సంజయ్‌కుమార్ పాల్గొన్నారు.
రేపు జపాన్ పర్యటనకు సీఎం
ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి జ పాన్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఐ టీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బా బు, రాష్ర్ట అధికారుల ప్రతినిధి బృం దం సీఎం వెంట ఈ పర్యటనలో ఉం టారు. ఏప్రిల్ 16 నుంచి 22వరకు తె లంగాణ ప్రతినిధి బృందం జపాన్‌లో పర్యటించనుంది.
టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హీరోషిమాలో ముఖ్యమంత్రి బృందం పర్యటిస్తుంది. ఓసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభిస్తుంది. ఆ దేశ ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రతినిధులతో సీఎం బృందం సమావేశమవుతుంది. రాష్ర్టంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహ కారంపై చర్చలు జరుపుతుంది.