calender_icon.png 16 January, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరాంపూర్ ఓసీలో సేఫ్టీ అవార్డు కమిటీ పర్యటన

19-07-2024 03:51:40 AM

మంచిర్యాల, జూలై 18 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఉపరితల గనిని ఆలిండియా మైన్స్ సేప్టీ అవార్డు కమిటీ తనిఖీ బృందం గురువారం సందర్శించింది. సింగరేణి వ్యాప్తంగా నాలుగు గనులను ఆలిండియా మైన్స్ సేప్టీ అవార్డుకు ఎంపిక చేయగా, సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఓసీలలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ ఓసీ చోటుదక్కించుకుంది. గురువారం ఈ బృందం ఎస్సార్పీ ఓసీలో తనిఖీలు చేసింది. చేస్తున్న ఇంజినీర్లు భారీ యంత్రాలతో వినియోగించే ఆటోమెటిక్ ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టం పని తీరును, ఎప్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంటు పని విధానాన్ని వివరించారు.

అలాగే మహిళా ఉద్యోగులు సీపీఆర్‌ను కమిటీ సభ్యులకు కూలంకుశంగా వివరించి, సీపీఆర్ విధానాన్ని కమిటీ సభ్యుల ముందు ప్రదర్శించారు. అనంతరం గనిపై బృంద సభ్యులు మొక్కలు నాటారు. గనిని సందర్శించిన బృందంలో కమిటీ చైర్మన్ వెంకన్న (డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేప్టీ, మైనింగ్ సౌత్ సెంట్రల్ జోన్ హైదరాబాద్), కమిటీ సభ్యులు అనురాగ్ శేఖర్ దూబే (జీఎం వెస్ట్రన్ కోల్ లిమిటెడ్), రవీంద్ర పీ గత్వార్ (జీఎం హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్), మనోరంజన్ మహలి (జీఎం యూరేనియం కార్పొరషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), సురేష్ మూర్తి (జీఎం నైవేలి), డాక్టర్ రితేష్ (వెస్ట్రన్ కోల్డ్ లిమిటెడ్), ఏరియా ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ శ్రీనివాస్‌తోపాటు ఓసీపీ పీవో శ్రీనివాస్, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, అపెక్స్ కమిటీ సభ్యులు ఏవీ రెడి  తదితరులు పాల్గొన్నారు.

ఓసీపీ 2 ఘటన చాలా బాధాకరం..

రామగుండం (మంథని), జూలై 18 (విజయక్రాంతి): సింగరేణి ఓసీపీ ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన అత్యంత బాధాకరమనీ, దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని శ్రీపాద ట్రస్టు చైర్మన్, కాంగ్రెస్ నేత శ్రీనుబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరిఖనిలో గురువారం మృతుల కుటుంబాలను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్‌తో కలిసి పరామర్శించారు. సింగరేణి కార్మికులు దేశ సరిహద్దులో సైనికులతో సమానమని అన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.