calender_icon.png 4 April, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నివారణకు సురక్షిత ప్రయాణం

22-03-2025 12:56:41 AM

జిల్లా ఎస్పీ అశోక్’కుమార్

జగిత్యాల అర్బన్, మార్చి 21(విజయక్రాంతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే ఉద్దేశ్యంతో సురక్షిత ప్రయాణం అనే ప్రత్యేక కార్యక్రమం జిల్లా ఎస్పి అశోక్’కుమార్ ప్రారంబించారు. ఇందులో బాగంగా శుక్రవారం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగే ప్రదేశాలు (బ్లాక్ స్పాట్స్) నేషనల్ హైవే అథారిటీ అధికారులు, పోలీసులతో కలిసి ఎస్పీ సందర్శించారు.

ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం వల్లే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు అన్ని రకాల  చర్యలు తీసుకోవడం జరుగుతుంది కానీ, ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రజల సహకారం అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా అధిక రోడ్డు ప్రమాదాలు జరిగే 43 ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, వివిద శాఖల సమన్వయంతో ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటు పోలీస్ కళా బృందం ద్వారా జాతీయ రహదారిపై ఉన్న అన్ని గ్రామాల్లో అవగాహాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని,  హైవేలపై జరిగే యాక్సిడెంట్ లకు సంబంధించి ఫస్ట్ రెస్పాండర్స్‌గా ఉండే పెట్రోల్ బంక్ వారికి,  ధాబాలో పనిచేసే వారికి, యూత్, విలేజెస్’కి ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్ పై అవగాహన కలిగించడం జరిగిందన్నారు.   

స్పీ వెంట డిఎస్పి రఘుచంధర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫిక్ ఖాన్, సిఐలు వేణుగోపాల్, కృష్ణారెడ్డి, రవి, హైవే ఏఈ లక్ష్మణ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ప్రమీల ఉన్నారు.