ప్రారంభించిన కొత్తగూడెం ఆర్డీవో మధు...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నవ లిమిటెడ్, పాల్వంచ వారు సామాజిక బాధ్యత కార్యక్రమాలలో భాగంగా మైలారం నందు ఏర్పాటు చేసిన 26వ సురక్షిత మంచినీటి కేంద్రాన్ని శుక్రవారం కొత్తగూడెం ఆర్డీవో డి.మధు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మైలారం గ్రామస్థులు సురక్షిత మంచినీటి కేంద్రం కొరకు తీర్మానం చేసుకొని నవ లిమిటెడ్ యాజమాన్యాన్ని సంప్రదించడం జరిగింది. వారు వెంటనే ఈ సురక్షిత మంచినీటి కేంద్రాం నిర్మాణం చేపట్టి, మైలారం పంచాయతీకి అప్పగించడం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్.డి.ఓ మాట్లాడుతూ... కలుషిత మంచినీటి వలన వచ్చే రోగాలను ఆదిగమించడానికి ఈ సురక్షిత మంచినీటి కేంద్రం ఉపయోగపడుతుందని గ్రామంలో ప్రజలందరూ ఈ సధవకాశన్ని ఉపయోగిచుకోవాలని కోరారు. అలాగే నవ లిమిటెడ్ చేస్తున్న వివిధ సంఘ సేవా కార్యక్రమాలను కొనియాడాడం జరిగింది. జనరల్ మేనేజర్ సి.యస్.ఆర్.ఎం.జి.ఎం. ప్రసాద్ మాట్లాడుతూ... ఆరోగ్యం, విద్య, జీవనోపాదుల కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వి. ఖాదారేంద్ర బాబు చీఫ్ లైజన్ ఆఫీసర్, ఎన్. సత్యనారాయణ, సి. యస్. ఆర్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.