calender_icon.png 4 April, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలి

03-04-2025 07:12:10 PM

డైరెక్టర్ పిపి వెంకటేశ్వర్లు..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు అధికారులు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ పిపి వెంకటేశ్వర్లు, కార్పొరేట్ జిఎం సేఫ్టీ చింతల శ్రీనివాస్ లు కోరారు. రక్షణ చర్యలపై గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో వారు మాట్లాడారు. ఎలక్ట్రికల్/మెకానికల్/డిపార్ట్మెంట్ లు గనులకు సంబంధించి తీసుకోవలసిన రక్షణ చర్యలపై సేఫ్టీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్బంగా గనుల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలు వివరించారు. ఎల్లప్పుడు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించడానికి ప్రతి ఒక్కరు సమిష్టి కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజనల్ సేఫ్టీ జి.ఎం కే రఘుకుమార్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, అన్ని గనుల సేఫ్టీ ఆఫీసర్లు, డిపార్ట్మెంట్ల ఇంజనీర్లు, పిట్ ఇంజనీర్లు, ఏరియా స్టోర్, ఏరియా వర్క్ షాప్, 132 కే.వీ, రామకృష్ణాపూర్, సిహెచ్పి సబ్ స్టేషన్ హెచ్ఓడి లు, పాల్గొన్నారు.