calender_icon.png 5 February, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలి

05-02-2025 07:26:33 PM

జిఎం సేఫ్టీ కార్పొరేట్ సిహెచ్ శ్రీనివాస్...

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో ప్రమాద రహిత బొగ్గు ఉత్పత్తికి కృషి చేసి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలని జీఎం సేఫ్టీ కార్పొరేట్ సిహెచ్ శ్రీనివాస్ కోరారు. ఏరియాలోని కేకే ఓసిపిని బుధవారం సందర్శించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు రక్షణ సూత్రాలు పాటించి విధులు నిర్వహించాలన్నారు. నా రక్షణ నాదే బాధ్యత, అలాగే నా రక్షణ నా కుటుంబ బాధ్యతగా బావించి  స్వతహాగా రక్షణ పొందాలన్నారు. పని స్థలాలలో తొందరపాటుతనంతో చిన్న నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతాయన్నారు. పని స్థలాలను నిశితంగా పరిశీలించిన అనంతరమే విధులు నిర్వహించాలని సూచించారు.

సూపర్వైజర్లు ముందుగా పని స్థలాలను పర్యవేక్షించిన అనంతరం పనులు అప్పగించాలన్నారు. ప్రతి ఒక్కరు సంస్థ తమదనే భావనతో పని చేస్తే ప్రగతి ఫలాలు విరబూస్తాయని స్పష్టం చేశారు. సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలను అధిగమించాలన్నారు. ఈ సందర్భంగా కేకే ఓసిపికి వచ్చిన సేఫ్టీ జియం కార్పొరేట్ కు ఏరియా జిఎం దేవేందర్ మొక్కను అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జిఎం రఘుకుమార్, కేకే ఓసిపి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.మల్లయ్య, ఏఎస్ఓ ఎంరవీందర్, ఇంచార్జ్ కేకే ఓసిపి ప్రాజెక్ట్ ఇంజనీర్ సురేష్, ఇన్చార్జి మేనేజర్ శ్రీధర్ గౌడ్, సేఫ్టీ ఆఫీసర్ కుష్వాలు పాల్గొన్నారు.