సెయింట్ లూసియా: టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సూపర్ గ్రూప్ భాగంగా శుక్రవారం జరిగిన పోరులో సఫారీ జట్టు 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (38 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. డేవిడ్ మిల్లర్ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు.
క్లాసెన్ (8), కెప్టెన్ మార్క్మ్ (1) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులకు పరిమితమైంది. హ్యారీ బ్రూక్ (37 బంతుల్లో 53; 7 ఫోర్లు), లియామ్ లివింగ్‌స్టోన్ (17 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. సఫారీ బౌలర్లలో రబడ, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.