calender_icon.png 22 February, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీశ్రీశ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవం

15-02-2025 10:54:33 PM

భీమదేవరపల్లి,(విజయక్రాంతి): శ్రీశ్రీశ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి ఉత్సవం మహాభోగ్ భండారో కార్యక్రమం శనివారం ఉదయం హనుమకొండ గిరిజన భవన్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా శ్రీశ్రీశ్రీ సద్గురుసేవాలాల్ జయంతి పురస్కరించుకొని హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుండి గిరిజన భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి కలెక్టర్ ప్రావిణ్య పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు. ప్రకృతి సంరక్షణ , అడవులను కాపాడుకోవడానికి అన్ని సామాజిక వర్గాలను సమానత్వం కొరకు సద్గురు సేవాలాల్  కృషి చేసినారని కొనియాడారు. ఆయన ఆశయాలను అందరు అనుసరించాలన్నారు. ఈకార్యక్రమంలో సేవాలాల్ ఉత్సవ కమిటీ సభ్యులు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.