- ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు చేయాలె..
- అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): నగరంలో ట్యాంక్‌బండ్‌పై ఈనెల 10వ తేదీన పదివేల మంది మహిళలతో సద్దుల బతుకమ్మ ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. మంగళవారం బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించా రు.
10న సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్‌పై చేరుకుంటారన్నారు. వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారన్నారు. బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్క్‌ల నుంచి ప్రత్యేకంగా ఫైర్ వర్క్స్, లేజర్ షోల ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు.
పలు జంక్షన్ల వద్ద విద్యుత్ దీపాలతో అలకరించినట్లు తెలిపారు. బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని వాడలు, కాలనీ లు, బస్తీల నుంచి పెద్దఎత్తున మహిళలు వ చ్చే అవకాశమున్నందున వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్క్‌లో ఉన్న బతుకమ్మ ఘాట్‌తో పాటు నెక్లెస్ రోడ్డులో బతుకమ్మ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, హెచ్‌ఎండీ ఏ, జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించా రు.
సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నందన ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్ వంటి సౌకర్యాలు ఏర్పా టు చేయాలన్నారు. అమరవీరుల స్మారక కేంద్ర నుంచి ట్యాంక్‌బండ్ వరకు ప్రత్యేకంగా బారికేడింగ్, లైటింగ్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. ప్రతి విభాగం ఒక సీనియర్ అధికారిని ప్రత్యేకంగా నియమించి ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు.
సమీక్షలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులు వాణాప్రసాద్, దాన కిషోర్, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్, రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ఇందనశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా తదితరులు పాల్గొన్నారు.