సూర్యాపేట,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా సద్దుల బతుకమ్మ సంబురాలు జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని మహిళలందరూ రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను తీసుకుని దేవాలయం వద్దకు తీసుకుని వచ్చి మహిళలకు, ఆడపిల్లలకు ఎంతో ప్రీతిపాత్రమైన సద్దుల బతుకమ్మ పండుగను పాటలతో, కోలాటాలతో బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ సంబురాలు వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. గత ఎనిమిది రోజులపాటు తెలంగాణ ఆడపడుచులందరూ భక్తిశ్రద్ధలతో, ఆటపాటలతో సంబురంగా జరుపుకున్న బతుకమ్మ పండగ నేడు తొమ్మిదవ రోజుకు చేరుకుంది.