calender_icon.png 10 October, 2024 | 11:44 PM

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

10-10-2024 09:55:16 PM

మంచిర్యాల,విజయక్రాంతి: మంచిర్యాల జిల్లాలో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోల్ బెల్ట్ ప్రాంతమైన నస్పూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, తాండూరు మండలాలతోపాటు మిగితా మండలాల్లో తీరొక్క రంగు పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోటకు తీసుకువచ్చి బతుకమ్మ ఆటపాటలతో ఆనందంగా గడిపారు. అనంతరం సమీప గోదావరి, ప్రాణహిత నదులతోపాటు వాగులు, చెరువులలో బతుకమ్మలను నిమజ్జనం చేసి సత్తులను పంచిపెట్టారు. బతుకమ్మ వేడుకలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల అధ్యక్షులు నాయకులు తిరిగి పరిశీలించి మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.