calender_icon.png 10 October, 2024 | 11:47 PM

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

10-10-2024 09:14:02 PM

హనుమకొండ,(విజయక్రాంతి): సద్దుల బతుకమ్మ సంబురాలలో మహిళలు గురువారం ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ ఉత్సవంలో మహిళలు పెద్ద ఎత్తున ఒకే చోట చేరి  బతుకమ్మ ఆటపాటలతో పండుగ వైభవాన్ని చాటి చెప్పారు. తీరొక్క పూలతో ఆకట్టుకునేలా తయారుచేసిన  బతుకమ్మల చుట్టూ చేరి  బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. హనుమకొండ నగరంలోని  పద్మాక్షి దేవాలయం ముందు వేలాదిమంది మహిళలు బతుకమ్మ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆటపాటల అనంతరం బతుకమ్మలను పద్మాక్షమ్మ గుండంలో నిమజ్జనం చేశారు. పద్మాక్షమ్మ దేవాలయం వద్ద జరిగిన బతుకమ్మ ఉత్సవాలలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.