టీమిండియా మాజీ క్రికెట్ సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ అయిన ప్రకాశ్ కాప్డే సచిన్ వీవీఐపీ సెక్యూరిటీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన వయసు 39 సంవత్సరాలు. ప్రకాశ్ ఇటీవలే తన విధులకు సెలవు పెట్టి సొంతగ్రామానికి వెళ్లాడు. ప్రస్తుతం అక్కడే ఉన్న ప్రకాశ్ బుధవారం ఉదయం తన సర్వీస్ రివాల్వర్ తో మెడపై కాల్చుకున్నాడు.
గమనించిన కుటుంబీకులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రకాశ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రకాశ్ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రశాక్ ఆత్మహత్యపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.