లండన్: సుదీర్ఘ కెరీర్‌లో తాను చూసిన బెస్ట్ బ్యాటర్లలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ది తొలి స్థానమని ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ పేర్కొన్నాడు. కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న అండర్సన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ నా దృష్టిలో బెస్ట్ బ్యాటర్ సచిన్ టెండూల్కర్. మా ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా ఉండేది. అతడికి బౌలింగ్ చేయడం ఇష్టపడేవాన్ని. భారత గడ్డపై సచిన్ వికెట్‌కు చాలా విలువ ఉండేది. అతన్ని ఔట్ చేస్తే స్టేడియం వాతావరణం మారిపోయేది’ అని జిమ్మీ అండర్సన్ అన్నాడు. విండీస్‌తో టెస్టులో ఇంగ్లండ్ విజయానికి చేరువైంది. ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులు చేయగా.. విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.