calender_icon.png 15 November, 2024 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లగచర్ల రైతులను పరామర్శించిన సబితా ఇంద్రారెడ్డి

14-11-2024 04:21:31 PM

వికారాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం పరిగి సబ్ జైల్లో మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్వర్ రెడ్డిలతో కలిసి లగచర్ల రైతులను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీని బలవంతంగా తీసుకొచ్చి ప్రజలకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేసేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై  దాడికి పాల్పడిన ఘటనలో 55 మంది నిందితులను పోలీసు అరెస్టు చేశారు. ఇందులో ప్రధాని నింధితుడు భోగమోని సురేష్ పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడిగా గుర్తించారు. సురేష్ తో నరేందర్ రెడ్డి 42 సార్లు ఫోన్లో మాట్లాడారు. దీంతో నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్ విధించింది కొడంగల్ కోర్టు.