calender_icon.png 3 January, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గామాతను దర్శించుకున్న సబిత

12-10-2024 02:47:28 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్కేపురం డివిజన్ పరిధి గ్రీన్‌హిల్స్ కాలనీలోని సాయిబాబా ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాతను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా సమాజ సేవకుడు, జగిని ఫర్నీచర్స్ అధినేత జగిని శ్రీనివాస్ గుప్తా సమకూర్చిన బహుమతులను అందజేశారు.