08-04-2025 08:01:17 PM
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా..
ప్రగతి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన సాబీర్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, ఓటమిని స్ఫూర్తిగా తీసుకొని గెలుపుకోసం కృషి చేయాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా క్రీడాకారులను కోరారు. పట్టణంలోని ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి ప్రీమియర్ క్రికెట్ లీగ్లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థులు క్రీడా, సంస్కృతిక రంగాల వైపు దృష్టి సారించాలని సూచించారు. యువత ఆధునిక పోకడలకు ఆకర్షితులవకుండా మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు.
వేసవి సెలవుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచుకొని భవిష్యత్తులో జరిగే రాష్ట్ర, జాతీయ స్టైపోటీల్లో రాణించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని, క్రీడామైదానాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని, వారి కృషికి క్రీడాకారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కంచర్ల జమలయ్య, కత్తెర రవీందర్ తదితరులు పాల్గొన్నారు.