calender_icon.png 26 October, 2024 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత్రికేయుడి సాహసాల సబర్మతి రిపోర్ట్

26-10-2024 12:00:00 AM

చరిత్రాత్మక థ్రిల్లర్‌గా రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’. ధీరజ్ సర్నా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా, రిద్ధి డోగ్రా నటించగా, శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, అమూల్ వీ మోహన్, అన్షుల్ మోహన్ నిర్మించారు. ఈ సినిమా టీజర్ శుక్ర వారం విడుదలైంది. 2002లో దేశాన్ని కుదిపేసిన గోద్రా సంఘటనను డీకోడ్ చేసే ఒక ధైర్యవంతు డైన పాత్రికేయుడిగా విక్రాంత్ మాస్సే ఈ చిత్రంలో కనిపిస్తాడు.

అతను చేపట్టిన మిషన్‌లో భాగమైన వ్యక్తి పాత్రలో రాశీ ఖన్నా నటి స్తున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది. సీనియర్ జర్నలిస్టు పాత్రను రిద్ధీ డోగ్రా పోషించారు. నిజాలను వెలికితీసి, ప్రజల్లోకి తెలియజెప్పేందుకు ఓ ప్రత్యేక మిషన్ ఎలా పనిచేసిందనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కి నట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రం నవంబర్ 15, 2024న థియేటర్లలో విడుదల కానుంది.