calender_icon.png 9 October, 2024 | 6:01 AM

శబరిమల ఆలయ ప్రసాదం కల్తీ

08-10-2024 01:33:19 AM

తయారీకి వినియోగించే యాలకుల్లో పెస్టిసైడ్స్

తిరువనంతపురం, అక్టోబర్ 7: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయిందా? లేదా? అనే విషయం తేలకముందే మరో ప్రముఖ ఆలయంలో ప్రసాదం కల్తీ వివాదం చెలరేగింది. దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో  ఒకటై న శబరిమలలో అరవణ ప్రసాదం భక్తులకు ప్రీతిపాత్రం.

ఇందులో మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయని తాజాగా ట్రావెన్‌కోర్ దేవస్థాన బోర్డు గుర్తించింది. ప్రసాదం తయారీకి వినియోగించే యాలకుల్లోనే పెస్టిసైడ్స్ ఉన్నట్లు నిర్ధారించింది. 6.65 లక్షల కంటెయినర్లలోని ప్రసాదాన్ని పూర్తిగా ఎరువుగా మార్చాలని నిర్ణయించింది. 

ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి

శబరిమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్రికులు కచ్చితంగా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకు గరిష్ఠంగా 80 వేల మందికి మాత్రమే దర్శనానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి విజయన్ ఆధ్వర్యంలో శబరిమల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. స్పాట్ బుకింగ్‌కు అవకాశమే ఉండదని స్పష్టం చేశారు.