calender_icon.png 24 January, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబలెంకా సాఫీగా

28-08-2024 12:30:00 AM

యూఎస్ ఓపెన్

  1. గాఫ్, క్రెజికోవా ముందంజ
  2. జొకోవిచ్ వేట మొదలు

న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అరీనా సబలెంకా శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సబలెంకా (బెలారస్) 6 6 తేడాతో ప్రిస్కిల్లా హన్ (ఆస్ట్రేలియా)పై ఘన విజయాన్ని అందుకుంది. మరో సింగిల్స్‌లో  కోకో గాఫ్ ముందంజ వేసింది. తొలి రౌం డ్‌లో గాఫ్ 6 6 తేడాతో గ్రెచెవా (ఫ్రాన్స్)పై సునాయస విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో 8వ సీడ్  క్రెజికోవా, 14వ సీడ్ మాడిసన్ కీస్‌లు ముందంజ వేశారు.

జొకోవిచ్ ఘనంగా..

25వ గ్రాండ్‌స్లామ్ టైటిలే లక్ష్యంగా యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తన వేటను ఘనంగా ఆరంభించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో జొకోవిచ్ 6 6 6 తేడా తో అల్బాట్ (మాల్డోవా)పై  సునాయస విజయం నమోదు చేసుకున్నాడు. యూఎస్ ఓపెన్‌లో జొకోకు ఇది 89వ విజయం కావడం విశేషం. తద్వారా టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ (89 విజయాలు)తో  జొకో విచ్ సమానంగా నిలిచాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో జ్వెరెవ్, రూడ్‌లు రెండో రౌం డ్‌కు చేరుకున్నారు. ఇక భారత్ నుంచి సింగిల్స్ బరిలో ఉన్న సుమిత్ నాగల్ తొలి రౌండ్‌కే పరిమితమయ్యాడు.