calender_icon.png 20 January, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబలెంక సాఫీగా.. అల్కరాజ్ అలవోకగా

20-01-2025 12:46:53 AM

* క్వార్టర్స్‌లో జకోవిచ్, బడోసా, గాఫ్ 

* రసవత్తరంగా మ్యాచ్‌లు

* ఆస్ట్రేలియన్ ఓపెన్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ డిఫెండింగ్ చాంపియన్ సబలెంక ప్రిక్వార్ట ర్స్‌లో సునాయస విజ యం సాధించి.. క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. రష్యా టీనేజర్ అండ్రేవాతో తలపడ్డ సబలెంక సునాయస విజయం సాధించి.. వరుసగా రెండో ఏడాది కూడా క్వార్టర్స్ గడప తొక్కింది. నాలుగో రౌండ్ మ్యాచ్‌లో సబలెంక (బెలారస్) 6 6 తేడాతో ఆండ్రీవా (రష్యా) మీద వరుస సెట్లలో విజయం సాధించింది.

రష్యా టీనేజర్ ఆండ్రీవా చాంపియన్ సబలెంకకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆండ్రీవా రెండు ఏస్‌లు సంధించినా ఫలితం లేకపోయింది. 3 డబుల్ ఫాల్ట్‌లు చేసి మ్యాచ్‌ను దూరం చేసుకుంది. ఇక మిగతా మ్యాచ్ లలో బడోసా (స్పెయిన్), ప్లావిచెంకోవా (రష్యా), గాఫ్ (అమెరికా) విజయాలు సాధిం చి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. క్వార్టర్స్‌లో సబలెంకతో ప్లావిచెంకోవా, గాఫ్‌తో బడోసా తలపడనున్నారు. 

అల్కరాజ్‌కు సునాయాస విజయం

పురుషుల సింగిల్స్‌లో కార్లోస్ అల్కరాజ్ () 7 6 తేడాతో డ్రాపర్ (యూకే) మీద వరుస సెట్ల లో విజయం సాధించాడు. జకోవిచ్ మాత్రం విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ ట్రై బ్రేక్‌కు దారి తీయగా.. జకోవిచ్‌నే విజయం వరించింది. జకోవిచ్ (సెర్బియా) 6 6 7 (7 తేడాతో  జిరి లెహెక్కా (చెక్ రిపబ్లిక్) మీద చెమటోడ్చి విజయం దక్కించుకున్నాడు.

రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ పోరులో చివరికి జకోవిచ్‌నే గెలుపు వరించింది. ఈ గెలుపుతో జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. జ్వెరెవ్ (జర్మనీ) 6 2 6 6 తేడాతో హంబర్ట్ (ఫ్రాన్స్) మీద విజయం సాధించాడు. అమెరికాకు చెందిన పాల్ 6 6 6 తేడాతో వరుస సెట్లలో డేవిడోవిచ్ (స్పెయిన్) మీద సునాయాస విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.